క్రిస్మస్ పండగను పురస్కరించుకుని పట్టణంలోని శిల్పారామం, వైఎస్ఆర్ లేక్ ఫ్రంట్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. శిల్పారామ ఏవో సుధాకర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల చిన్నారులు క్రిస్మస్, సినిమా పాటలకు నృత్యాలు చేశారు. క్రిస్మస్ పండుగ వల్ల సందర్శకులతో శిల్పారామం, వైఎస్సార్ లేక్ ఫ్రంట్లు నిండుగా దర్శనమిచ్చాయి.