రెవెన్యూ సదస్సులలో రైతుల సమస్యలకు వంద శాతం న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. గతంలో జరిగిన తప్పిదాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులను అధికారులు పరిష్కరించాలని సూచించారు. రైతుల సమస్యలపై అధికారుల కాలయాపన సరికాదన్నారు.