కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సాగునీటి ఎన్నికల లేఖ అంశాన్ని టీడీపీ నాయకులు వెంకట్రామిరెడ్డి ఖండించారు. శుక్రవారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు. అప్పుడు లేని ప్రజాస్వామ్యం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని మండిపడ్డారు.