వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేంపల్లి సమీపంలోని ఎద్దుల కొండ వృషభాచలేశ్వర స్వామిని పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయనకు ఆలయ విశిష్టతను వివరించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని మాజీ పాలకమండలి సభ్యులు రమణ, ఆలయ ఈవో విశ్వనాథ్ రెడ్డి కోరారు.