వేంపల్లె మండలం తాళ్లపల్లి నుంచి కుప్పాలపల్లెకు వెళ్లే రహదారి కంకర తేలి అధ్వానంగా తయారైంది. గతంలో ఈ దారిలో కొంతమేర రోడ్డు వేసినా కల్వర్టు వద్ద సీసీ రోడ్డు నిర్మించలేదు. ఈ మార్గంలో వెళ్లేందుకు స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కుప్పాలపల్లి రోడ్డు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుని రోడ్డు పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు.