వైసీపీ, ఎన్డీఏ కూటమి పార్టీలు రాష్ట్రానికి పట్టిన రాహు కేతువులని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డా. తులసిరెడ్డి ద్వజమెత్తారు. బుధవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ, టీడీపీ కూటమి దొందూ దొందేనని తులసిరెడ్డి అన్నారు. వైసీపీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే కూటమి కైలాసం చూపిస్తోందని అన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల, అరాచక, మద్య, జూద, గంజాయి, డ్రగ్గాంధ్ర ప్రదేశ్ చేసిందన్నారు.