రైతుల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులలో సమస్యలు ఉండడంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవితను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథిరెడ్డి కోరారు. గురువారం విజయవాడలోని ఆమె నివాసంలో మంత్రి సవితను వేముల మండలానికి చెందిన పార్థసారథి రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.