ప్రజా దర్బార్ లో వచ్చిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్న మండెం బోరెడ్డి గారి పల్లెలో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.