గండికోట రిజర్వాయర్ ను పూర్తిగా నింపడం ఇదే మొదటిసారి
శ్రీశైలం రిజర్వాయర్ నుండి ప్రవాహం వచ్చినందు వల్ల 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండికోట రిజర్వాయర్ కు వరద నీటిని తీసుకువచ్చి 25. 5 టీఎంసీలతో నింపడం జరిగిందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత 25. 5 టిఎంసి ల మేర నీటిని నిల్వ చేయడం ఇదే తొలిసారి అన్నారు.