కాకినాడలో ఘనంగా ప్రారంభమైన యువజనోత్సవాలు
ఆధునిక యుగంలో అంతరించిపోతున్న ప్రాచీన కళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం పోస్తుందని కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ, సెట్రాజ్ కాకినాడ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు కాకినాడలో సత్య కళవాహినిలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు, తదితర పోటీలు నిర్వహించారు.