అనపర్తి టీటీడీ కళ్యాణమండపంలో జరుగుతున్న 26వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త ఉపేందర్ రెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డాక్టర్ డా. తేతల సత్య సాయి రామా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళానికి చెందిన శ్రీకాంత్ రఘుపాత్రుని శిష్య బృందం శాస్త్రీయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. పలు ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించారు.