భీమిలి బీచ్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
భీమిలి బీచ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 40 ఏళ్ల వయస్సు గల పురుష మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చిందని, మృతుడి చేతి మీద రాధ అని పచ్చబొట్టు ఉందని భీమిలి పోలీసులు తెలిపారు. ఎటువంటి వివరాలు లభించలేదని, మృతదేహం వివరాలు తెలిస్తే భీమిలి సీఐ 9440904712, ఎస్ఐ 9182694835 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.