మామిడికుదురు మండలం పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్ లో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు అర కిలోమీటర్ మేర జాతీయ రహదారి విస్తరణ పనులు జాప్యం నేపథ్యంలో ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ అవుతుందని స్థానికులు వాపోతున్నారు.