గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఉన్న దుర్గాదేవి ఆలయం వద్ద భక్తులు ఆదివారం పోటెత్తారు. సంక్రాంతి సెలవులు ముగింపును పురస్కరించుకుని ఆదివారం కూడా కలిపి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జగ్గంపేట సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.