మండపేట పట్టణంలో ఉగాది సందడి నెలకొంది. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను వైభవంగా నిర్వహించేందుకు పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని కెపి రోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన దుకాణాల వద్ద పండుగ కోసం వేప పువ్వు, మామిడి కాయలు, పువ్వులు , చెరుకు ముక్కలు, మామిడి ఆకులు, అరటి పళ్ళు, కొనుగోలు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని కెపి రోడ్డు మెయిన్ రోడ్డులలో జనంతో ఎక్కిరిసిపోయాయి.