శ్రీశ్రీ కళా వేదిక, కోనసీమ రచయితల సంఘం ఆధ్వర్యంలో అమలాపురంలో ఆదివారం జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాట్రేనికోనకు చెందిన చింతా రాంబాబు, మల్లాడి శ్రీనివాస్ లు పాల్గొని తెలుగు భాష యొక్క గొప్పతనంపై కవితాగానం చేసారు. వీరిని కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, తెలుగు అధ్యాపకులు తడపర్తి సత్యనారాయణ, కళా వేదిక జాతీయ, ఆర్గనైజషన్ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ సన్మానించారు.