గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన తోట త్రిమూర్తులు ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. చల్లావారివీధి రామాలయం సమీపంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో మంటలు వ్యాపించి తీవ్రగాయాలయ్యాయి. బాకీ చెల్లించే విషయంపై మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తీవ్రంగా గాయపడిన అతనిని అంబులెన్స్ లో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్ కు తరలించారు.