పిఠాపురం: పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

56చూసినవారు
పిఠాపురం: పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
పిఠాపురం ఆంధ్రకేసరి ప్రకాశం మున్సిపల్ హైస్కూల్ 1996-97 పదోతరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు. 28 ఏళ్ల తర్వాత విద్యార్థులు ఇల్లింద్రాడ తోటలో కలిశారు. నాటి మధుర స్మృతులు, జ్ఞాపకం చేసుకున్నారు. పాఠశాల వదిలిన తర్వాత జీవన గమనంలో సాధించిన విజయాలు మార్పులు ఒకరికొకరు చెప్పుకున్నారు. తమ కుటుంబాల గురించి పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆట పాటలతో కాలం గడిపారు.

సంబంధిత పోస్ట్