పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. రాజరాజేశ్వరీ సమేత శ్రీకుక్కుటేశ్వర స్వామి ఫొటోలతో ముద్రితమైన రశీదు పుస్తకాలను హోమగుండంలో వేసి ఆదివారం దహనం చేశారు. పవిత్రమైన హోమగుండంలో హోమ ద్రవ్యాలు మాత్రమే వేసే దాంట్లో ఇలా రశీదు పుస్తకాలు వేయడం అపచారమని పలువురు విమర్శిస్తున్నారు. ఆలయ ప్రతిష్టతను అధికారులు పట్టించుకోవట్లేదని, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.