రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి భవాని చారిటబుల్ ట్రస్ట్ & దాతల సహకారంతో రూ.4,00,000 విలువైన 4 ఫ్రీజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ జనసేన ఇన్ ఛార్జ్ అను శ్రీ సత్యనారాయణ, వైద్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.