దేవరపల్లి: ప్రజల సౌకర్యార్థం బోర్ ఏర్పాటు
రాజమండ్రి రూరల్ పరిధిలోని దేవరపల్లి గ్రామంలో యాదవోలు రోడ్డులో ప్రజల సౌకర్యార్థం గ్రాంటు నుంచి బోరు ఏర్పాటు చేశామని సర్పంచ్ కడిమి వీర కుమారి ఆదివారం తెలిపారు. వినతులు వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నామని, అందరూ నాయకులు సహకరిస్తున్నారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. దేవరపల్లి ప్రజల వినతులను సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.