అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరా బాద్ వారి ఆధ్వర్యంలో డిసెంబర్ 8 న ప్రదర్శించే 'సంఘం శరణం గచ్చామి' అనే సాంఘిక నాటకం కోసం రూపొందించిన కరపత్రం, గోడపత్రికను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఈ సాంఘిక నాటకం రామచంద్రపురం జూనియర్ కళాశాల ప్రాంగణంలో డిసెంబర్ 8 న సాయంకాలం 6:00 నుండి రాత్రి 9: 00 వరకు ప్రదర్శింప బడుతుందన్నారు.