తుని మండలం ఎస్. అన్నవరంలోని శ్రీ నల్లగొండమ్మా అమ్మవారి 13వ బోనాల పండుగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 108 బోనాలుతో గ్రామంలో మహిళలు ఊరేగింపుగా బయలుదేరి గ్రామ పురవీధుల్లో గుండా ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి బోనాల సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ వారు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.