బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో బుధవారం పశువుల వైద్యశాలలో రాష్ట్ర పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ దుర్గభవాని ఆధ్వర్యంలో గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లకు వైద్య సేవలు అందించారు. టీకాలు, మందులు, పురుగు నివారణ చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సామ్రాజ్యం, రైతులు పాల్గొన్నారు.