గన్నవరం నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కు బాధితులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం అందజేశారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ముస్తాబాద్ గ్రామానికి చెందిన చీమలదండు లక్ష్మీ దుర్గ అనే మహిళకు వైద్యం నిమిత్తం ఈ చెక్కును అందించారు. సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.7లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.