జగ్గయ్యపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గండ్రాయి మెయిన్ నందు శుక్రవారం సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలను పండుగల విశిష్టతను వివరించాలనే సదుద్దేశంతో పాఠశాలలో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. తెలుగు వారి పండుగలలో అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి విశేషాలను పిల్లలకు వివరించారు. హరిదాసు వేషధారణ వేసి ఆకట్టుకున్న ఉపాధ్యాయుడు రమేష్ బాబును అభినందించారు.