కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల పట్టణ కార్యదర్శి ఎస్ నాగమణి, సిపిఎం పార్టీ నాయకులు దాసరి నాగేశ్వరరావు, రావెళ్ళ శేషు, వివి రాంప్రసాద్, కోటా కృష్ణ, కోటా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.