పెనుగంచిప్రోలు మండలం సుబ్బయ్య గూడెంలో దమ్ము చక్రాల తాకిడికి కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి పరిచిన రోడ్లు ఛిద్రమయ్యాయి. వేసిన రహదారులు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయని ప్రజలు అంటున్నారు. కొంతమంది అవగాహన లేక రోజూ పొలాలకు దమ్ము చక్రాలు తగిలించుకొని ట్రాక్టర్ పై వెళ్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని శనివారం స్థానికులు చెప్పారు. అధికారులు అవగాహన కల్పించి, చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.