ఈనెలాఖరిలోగా ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్. పి. సిసోడియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో ఫ్రీ హోల్డ్ భూములపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో 682 ఎకరాలు ఫ్రీహోల్డ్ భూములుగా గుర్తించామని, 11. 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగిందని వివరించారు.