తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో శనివారం నీటి సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వల్లూరుపాలెం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ గా కాట్రగడ్డ రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడిగా చాగంటి బసివి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా అరవల్లి సురేశ్ బాబు, బడుగు రామారావు, భీమవరపు కోటిరెడ్డి జంగా శివరామ కృష్ణారెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం వారిని కూటమి నేతలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.