రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పూర్తి సమన్వయంతో పని చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సూచించారు. సోమవారం నార్కో కోఆర్డినేషన్కు సంబంధించి మొదటి రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడ కార్యాలయంలో అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.