మోపిదేవి మండలం కోసువారిపాలెం గ్రామానికి చెందిన సతీశ్ ఇంటి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్పు చేయాలని అధికారులను కోరారు. సోమవారం గ్రామంలో ఆయన మాట్లాడుతూ, ఇంటి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన స్తంభాన్ని వేరే ప్రదేశానికి మార్చాలని కోరారు. గ్రామంలో స్తంభాలు అన్నీ ఒకే లైన్లో ఉండగా తన ఇంటి వద్ద లోపలికి వచ్చిందని ఆరోపించారు. అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాన్ని మార్చాలని కోరారు.