ఈ నెల 18న విజయవాడకు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. అదేరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరంకు చేరుకుని రాత్రి సీఎం చంద్రబాబుకు నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరు కానున్నారు. 19న విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ క్యాంపులను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారిక యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది.