ఉదయపు పర్యటనల్లో ప్రజలు భాగస్వామ్యలు కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే రాము మీ కోసం మీ ఎమ్మెల్యే శానిటేషన్ విజిట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకోడానికి అయన స్వయంగా పట్టణంలోని పలు వార్డులలో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తున్నారు. వార్డులలో పారిశుధ్య సమస్యలు, తాగునీటి సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలను పరిష్కరిస్తున్నారు.