ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జగ్గయ్యపేట పట్టణంలో రంగస్వామి వారి దేవాలయంలో శుక్రవారం స్వామివారికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కట్టా వెంకట నరసింహారావు, కౌన్సిలర్ పేరం సైదేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.