విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంకపాడుకి చెందిన టీడీపీ నేత రవీంద్రకు గాయాలయ్యాయి. సోమవారం పామర్రు మండలం కనుమూరు వద్ద విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారిపై రవీంద్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంకిపాడు మండల టీడీపీ అధ్యక్షుడు సుదిమళ్ళ రవీంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు పాక్షికంగా ధ్వంసంమైంది. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.