ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 14 మంది కూలీలకు గాయాలు ఐనా ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం గూడూరు మండలం మల్లవోలు నుంచి కూలీలతో పెనమలూరు వైపు ప్రయాణిస్తుండగా పామర్రు మండలం కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద ఆటో టైర్ పగలడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న 14మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఇతర వాహనదారులు గాయపడిన వారికి సపర్యలు అందించారు.