ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం గర్ల్స్ హైహ్ స్కూల్ నందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోలింగ్ కేంద్రాలను తిరువూరు ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావు గురువారం ఈ సందర్భంగా పోలింగ్ ఎలా జరుగుతుంది అని పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్లు తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు.