గంపలగూడెం మండలం పెనుగొలను బోటి మీది ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో రెండో రోజు ఆదివారం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. స్థానిక శివాలయం అర్చకులు దాములూరు సత్యనారాయణ శర్మ వేదమంత్రాలతో శ్రీ రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత నరసింహ స్వామి కళ్యాణం మేళ తాళాలతో చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.