బోధనేతర సిబ్బందిలో నైపుణ్యం పెంపొందించేందుకే కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఉపకులపతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నంలో విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బందికి నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణా తరగతులు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాంకేతిక పరమైన అంశాల్లో ఎప్పటికప్పుడు పనితీరును మెరుగు పరుచుకోవడానికి ఇటువంటి శిక్షణా తరగతులు అవసరమన్నారు.