అలిగేరలో చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
కూతుర్ల పెళ్లిళ్లు చేయలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆస్పరిలో చోటుచేసుకుందని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం కుటుంబ సభ్యులు తెలిపారు. అలిగేర గ్రామానికి చెందిన లక్ష్మన్న (45), పార్వతమ్మ దంపతులకు నలుగురు కూతుర్లు. అయితే వారి పెళ్లిళ్లు చేయలేక సోమవారం రాత్రి లక్ష్మన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు