కోడుమూరు: తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన

77చూసినవారు
కోడుమూరు: తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన
హైదరాబాద్‌లో టీవీ9 ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ కర్నూలు జిల్లా కోడుమూరులో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. బుధవారం కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీడబ్ల్యూజే నాగరాజు, రమేష్, రాజేష్ ఆధ్వర్యంలో రిపోర్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇది బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించిన వారు, మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డీటీ రామాంజనేయులుకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్