పెనుమంట్ర: ఎంపీపీ పాఠశాల లో స్మార్ట్ టీవీ ప్రారంభం
పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం లోని స్థానిక శివరావుపేట లోని ఎంపీపీ పాఠశాలలో సోమవారం స్మార్ట్ టీవీ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చంద్రిక మాట్లాడుతూ, స్మార్ట్ టీవీ వినియోగించడం ద్వారా విద్యార్థులకు పలు అంశాలను అర్థమయ్యేలా వివరించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సాంకేతికతను ఉపయోగించడం విద్యార్థుల అభ్యాసం లో మరింత అభివృద్ధి చేకూరుస్తుందని ఆమె చెప్పారు.