చైనాలో మెరిసిన సెపక్ తక్రా క్రీడాకారుడు మధుకు సన్మానం
ఆలూరు నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆసియా బీచ్ సెపక్ తక్రా ఛాంపియన్షిప్ -2024 క్రీడా పోటీల్లో కాంస్య పథకంతో విజేతగా నిలిచిన కురువ మధును బుధవారం ఆలూరు నియోజకవర్గం పరిధిలోని అతిధి గృహంలో మాదాసి, మాదారి కురువ సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు. మాదాసి కురువ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ.. పేద కుటుంబం నుంచి చదువుతోపాటు, క్రీడల్లో రాణిస్తూ దేశ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఇటీవల చైనాలో జరిగిన కాంస్య పథకం సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు.