దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి
ఈ నెల 12 న దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో దేవరగట్టు బన్ని ఉత్సవాల గురించి ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బన్ని ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.