మట్టి తరలిస్తున్న వాహనాలు స్వాధీనం

67చూసినవారు
మట్టి తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
మంత్రాలయం మండలం సుగురు గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టిని (గరుసు) తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు ఎస్సై పరమేశ్ నాయక్ శనివారం తెలిపారు. అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ఓ జేసీబీ, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసుకున్నామని తెలిపారు. అనుమతులు లేకుండా ఎర్రమట్టిని తరలిస్తే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని ఎస్ఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్