కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటన వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నందికొట్కూరులోని వాల్మీకి నగర్ పగిడ్యాల రోడ్డులో ఆదివారం రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలియజేసారు. నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. వారు మాట్లాడారు. అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలి, లేదంటే రాష్ట్రo అంతాట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.