పాణ్యం: భూ సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు

58చూసినవారు
పాణ్యం: భూ సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు
రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్ తెలిపారు. సోమవారం మండలంలోని కొమరోలు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి, తహసీల్దార్ మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల భూ సమస్యలను తమ దృష్టికి తెస్తే, వాటిని రీసర్వే చేసి 45 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. సదస్సులో సుమారు 35 వినతులు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్