గడ్డిపాడు: కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు
కొనుగోలు చేసిన ధాన్యానికి కూటమి ప్రభుత్వం 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. సోమవారం పమిడిముక్కల మండలం గడ్డిపాడులో ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి రైతులతో ముచ్చటించారు. అనంతరం ఉమా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సీఎంహెచ్చరించారని గుర్తు చేశారు.