పేదల పాలిట అమృత వరప్రదాయినులుగా అన్న క్యాంటీన్లు విరాజిల్లుతున్నాయని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రవీంద్ర పేర్కొన్నారు. గురువారం బొబ్బిలి చేరుకున్న ఆయన మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి తో కలిసి పట్టణంలో అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. పారిశుధ్యం, భోజన నిర్వహణ వంటి విషయాలను గమనించారు. భోజనం చేస్తున్న ప్రజలను కలిసి అన్న క్యాంటీన్ల పనితీరు ఎలా ఉందని అడిగారు.